శ్రీ వికృతి నామ ఉగాది వేడుకలకు ఆహ్వానం.
తెలుగు సోదర సోదరీమణులకు పిల్లలకు, పెద్దలకు, పుర ప్రముఖులకు ఇదే మా వికృతి నామ ఉగాది వేడుకలకు ఆహ్వానం.
గత ౩౩ సంవత్సరాలుగా నల నామ సంవత్సరంతో అంకురించి, చిగురించి ఇప్పటివరకు మూడు పువ్వులు ఆరు కాయలుగా భాసిల్లుతూ ఉన్నమన హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి ఈ సంవత్సరం క్రొంగొత్త ఉగాది కార్యక్రమాలతో మీ ముందుకు వస్తోంది.
ఉగాది పచ్చడి లో వుండే షడ్రుచుల సమ్మేళనంగా ఈ వికృతి నామ ఉగాది వేడుకల్లో పంచాంగ శ్రవణం, సంగీత, సాహిత్య, నృత్య, నాటిక, ఏకపాత్రాభినయం తో ఏర్చి కూర్చిన విభిన్నమైన, వినుత్నమైన కార్యక్రమాలతో మీ ముందుకు వస్తుంది.
వేదిక : మీనాక్షి దేవ స్థానం కళ్యాణమంటపం, పియర్లాండ్, టెక్షాస్
తేది : శనివారం మార్చి 20 , 2010
సమయం : మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలం 7 గంటల వరకు
(సమయానికి విచ్చేయ ప్రార్థన )
వికృతి నామ వేడుకలకు విచ్చేసి నూతన సంవత్సరాన్ని మన స్నేహితులతో, కుటుంబ సభ్యులతో, కొత్త స్నేహాలతో, ఉల్లాసంగా, ఆనందంగా, కన్నుల పండుగగా, వీనుల విందుగా జరిగే వినోదకరమైన కార్యక్రమాలతో, అంత కన్నా మించి మంచి తెలుగు భోజనం తో ఆస్వాదించండి.
సరదాగా ఉగాది పచ్చడి పోటిలో పాల్గొనండి. ఆఖరి తేది మార్చి 13 .
వివరాలకు శారద ఆకునూరి 281 -485 -9385 , శ్రీధర్ దాడి 281 -217 -9736
Link to the form : http://teluguhouston.org/tcahouston/?page_id=604
If you are interested in volunteering for the Ugadi event please email rrsolipuram@yahoo.com. We encourage adults and teenagers to help us by picking 1-2 hour slots for Reception, Hall Management, Food Distribution, TCA Activity Publicity Desks and Miscellaneous.